కామవరపుకోట మండలంలోని తడికలపూడి, కళ్లచెరువు, కె. ఎస్. రామవరం, జీలకర్రగూడెం గ్రామాలలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నలుగురిని ఎక్సైజ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి సుమారు 50 మద్యం బాటళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని చింతలపూడి ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు.