2024-25లో జరగబోయే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వం పరీక్ష ఫీజులను విడుదల చేసినట్లు జంగారెడ్డిగూడెం దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుముల లేకుండా చెల్లించవచ్చన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు.