85 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన భీమవరం ఎల్ హెచ్ టౌన్ హాల్ ను అభివృద్ది చేయడానికి ప్రతి సభ్యుడు బాధ్యత తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు,ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బుధవారం ది భీమవరం ఎల్ హెచ్ టౌన్ హాల్ జనరల్ బాడి సమావేశం నిర్వహించారు. మండలి చైర్మన్ మాట్లాడుతూ టౌన్ హాల్ కు ఎంతో ప్రత్యేకత స్థానం ఉందని, భీమవరంలో ఎన్ని క్లబ్ లున్నా టౌన్ హాల్ కుంటే ప్రత్యేకత వేరన్నారు.