టీడీపీ సభ్యత్వం నమోదు కార్యక్రమం ఆదివారం ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రారంభించారు. ఈరోజు నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని ఎవరైనా 100 రూపాయల కట్టి పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి, ఈ రెండు సంవత్సరాల్లో ఇన్సూరెన్స్ వర్తిస్తుందన్నారు. ఇది 2 సంవత్సరాలు కాలపరిమితి. ఈ రెండు సంవత్సరాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుందని, గతంలో 2 లక్షలు మాత్రమే ఉండేదన్నారు.