కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు అపన్న హస్తం అందించడమే సీఎం చంద్రబాబు ధ్యేయమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రిలోని ఎమ్మెల్యే వారి కార్యాలయం నందు ముగ్గురు లబ్ధిదారులకు సీఎం సహాయనిది చెక్కులను అందించారు. వైద్య ఖర్చులు భారమై ఆర్థిక ఒడిదుడుకులు పడుతున్న, పేదలను ఆదుకునేందుకు సీఎం సహాయనిధి ఉపయోగపడుతుందని అన్నారు.