పేదల సంరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే గోరంట్ల

74பார்த்தது
పేదల సంరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే గోరంట్ల
పేదల సంరక్షణ ధ్యేయంగా వారి ఆరోగ్యమే మహాభాగ్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నలుగురికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలని, ఆర్థికంగా వారికి ఇబ్బందులు రాకుండా సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేశారన్నారు.

தொடர்புடைய செய்தி