రాజమండ్రిలోని సౌత్ జోన్ డీఎస్పీ, మూడో పట్టణ పోలీసు స్టేషన్లలో శనివారం ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆయన శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల పై జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ తో చర్చించారు. నేరాల కేసుల ఛేదనలో సాంకేతికత వినియోగించుకోవాలని సిబ్బందికి సూచించారు.