రాజమండ్రి నగర పాలక సంస్థకు చెందిన ఎస్. హెచ్. ఈ బృందాలు సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకం పై సోమవారం తనిఖీలు కొనసాగించాయి. ఈ బృందాలు నగరంలోని 1, 24, 30వ వార్డులలో గల దుకాణదారులు, హోటల్స్, రెస్టారెంట్స్ లలో తనిఖీలు చేసి భారీగా జరిమానాలు విధించారు. అలాగే వారు పట్టుకున్న ప్లాస్టిక్ వస్తువులను జప్తు (సీజ్) చేసినారు.