జమ్ముకశ్మీర్ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి నేషనల్ కాన్ఫరెన్స్ విజయం సాధించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ బుధవారం హర్షం వ్యక్తం చేశారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు బీజేపీ వివిధ ఉచిత హామీలు ప్రకటించినప్పటికీ ప్రజలు నమ్మలేదన్నారు. జమ్మూ కాశ్మీర్ పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సాధనకు కృషి చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా నెరవేరుస్తుందన్నారు.