రాజమండ్రి రీజనల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ ఎమ్. స్నేహిత ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, సివిల్ సప్లయీస్ అధికారులు మంగళవారం అమలాపురం మండలంలోని భట్నవిల్లిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా అక్రమంగా వినియోగిస్తున్న 17 డొమెస్టిక్ సిలిండర్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంబంధిత షాపుల యజమానులపై కేసులు నమోదు చేశారు.