ఆన్ లైన్ విధానంలో భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులు సులభతరం చేసి, నిర్మాణదారులు, లేఅవుట్ డవలపర్స్ నిర్ధిష్ట కాలపరిమితిలోనే మంజూరు చేయడానికి సరైన మార్గదర్శనం చేయాలని రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా నిర్లక్ష్యంగా పనిచేసే లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్స్‌ల లైసెన్సులు రద్దు చేయడంలో వెనుకాడబోమని హెచ్చరించారు.