పేద ప్రజలకు అండగా భవాని చారిటబుల్ ట్రస్ట్ ఉంటుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలోని టీడీపీ కార్యాలయం వద్ద నగరంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి ఆర్ధిక సహాయం అలాగే చిరు వ్యాపారులకు తోపుడు బండిని భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎమ్మెల్యే చేతుల మీదకు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.