రాజమండ్రిలోని సీతంపేటలో ఉన్న శ్రీ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ లో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో శిక్షణ తరగతులను ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగుల గోపి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కురగంటి సతీష్, రూరల్ కో కన్వీనర్ యానాపు ఏసు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేతివృత్తులను నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలకు విశ్వకర్మ యోజన ఒక ఆసరాగా నిలుస్తుందని పేర్కొన్నారు.