భూ సమస్యలు ఉన్న రైతులందరూ ప్రభుత్వం నిర్వహిస్తున్న రీసర్వే గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలని సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్ర శేఖర రెడ్డి పేర్కొన్నారు. సామర్లకోట మండలం మామిళ్ల దొడ్డిలో రీ సర్వేగ్రామ సభ శుక్రవారం నిర్వహించారు. పలు భూ సమస్యలకు చెంది 26 అర్జీలను వీఆర్వోలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీటీ శ్రీనివాస్ తదితర మండల సర్వేయర్, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.