ప్రజల సమస్యల పరిష్కారమే తమకు ప్రధానమని నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి సమస్యను పరిష్కరిస్తానని ప్రజలకు తెలిపారు. అర్జీలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని సూచించారు.