మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకువచ్చేందుకు రాయితీతో కూడిన రుణాలను అందిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీనివాస అన్నారు. మహిళను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయుటకు నిడదవోలు ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డీపీఎం హేమంత్, ఐకెపి ఎపీఎం మహాలక్ష్మి, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.