మండపేట: అంగరలో కంటి వైద్య శిబిరం

60பார்த்தது
మండపేట: అంగరలో కంటి వైద్య శిబిరం
మండపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంగర ఆవరణలోని బలుసు సుబ్బారావు మెమోరియల్ ట్రస్ట్ నూతన భవనంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసారు. ఈ శిబిరం నందు అప్తాలమిక్ ఆఫీసర్ ఎస్. సత్యనారాయణ ద్వారా 48 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో నలుగురికి ఆపరేషన్ అవసరమని, మరో 18 మందికి కళ్ల జోళ్లు అవసరమని గుర్తించారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా.పి.ఎన్. ఎస్.డి. రత్నకుమారి, ఎమ్.పి.హెచ్.ఇ.ఒ.- జె. మల్లికార్జునుడు, హెల్త్ ఎడ్యుకేటర్ - బి. రామారావు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி