కొవ్వూరు గోదావరి నదీ తీరాన గల గోష్పాద క్షేత్రంలో బీజేపీ కిషాన్ మొర్చా ఆధ్వర్యంలో ఆదివారం గోపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సోము వీర్రాజు పాల్గొని గోవుకు పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుమల వేంకటేశ్వర స్వామి లడ్డూ అంశంలో చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో 'గోవు ఘోష వినండి గోవిందా' కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.