కొత్తపేట పట్టణ పరిధిలోని కమ్మిరెడ్డి పాలెం నుండి గౌతమి స్కూలుకు వెళ్లే రహదారిలో ఎలిమెంటరీ స్కూల్ ఎదురుగా ఉన్న పాడుబడ్డ పాత భవనాన్ని వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ భవనం పక్కనుండే పాఠశాల విద్యార్థులు మరియు స్థానికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. భవనం గోడలు బాగా శిధిలమై కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ప్రమాదం సంభవించక ముందే దానిని పరిశీలించి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.