రాజమండ్రిలో వర్తకుల శ్రేయస్సే ఎన్డీఏ కూటమి లక్ష్యమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నిక ఎన్డీఏ కూటమి ప్యానెల్ తో ఏకగ్రీవమైందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నికైన వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో జనసేన ఇంచార్జ్ అను శ్రీ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.