రెండవ రోజుకు కార్మికుల సమ్మె
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నీటి సరఫరా విభాగం సత్య సాయి పథకంలో పనిచేస్తున్న సుమారు 50 మంది కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం రెండవ రోజుకు చేరుకుంది. రాజమండ్రి గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ ఆఫీసు నందు నిరసనలు తెలియజేస్తున్నారు. పెండింగ్లో ఉన్న 16 నెలల జీతం, ఈఎస్ఐ, పిఎఫ్, కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజులుగా సమ్మె కొనసాగుతున్నా, అటు అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.