తూర్పుగోదావరిజిల్లా గోకవరంలో పశువులు రోడ్లపైనే సంచరించడంతో వాహనదారులుభయభ్రాంతులవుతున్నారు. ఇప్పటికే అనేకసార్లు పశురైతులను హెచ్చరించినా, వారిలో ఏవిధమైన మార్పురాలేదు. తాజాగా పంచాయతీ అధికారులు పశువులను జాగ్రత్తపెట్టుకోమని దండోరావేసి రైతులఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేసినాసరే పశువులను రోడ్లపైన వదిలేయడంతో స్థానికులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం.