వేంకటేశ్వర స్వామిపై వైఎస్ జగన్‌కు నమ్మకం ఉందా? లేదా? అనేది చెప్పాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఒకవేళ నమ్మకం ఉంటే అన్యమతస్థుల మాదిరి డిక్లరేషన్ ఇచ్చి దర్శించుకోవాలని తెలిపారు. ‘సంప్రదాయాలకు విరుద్ధంగా పని చేయమని ప్రజలు మీకు అధికారం ఇవ్వలేదు. సంప్రదాయాలను పాటించకపోతే తిరుమలకు ఎందుకు వెళ్లాలి. నిర్లక్ష్యంగా ప్రవర్తించి ప్రజల మనోభావాలు దెబ్బతీశారు.’ అని చంద్రబాబు నిలదీశారు.