అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు ఆట పాటలతో విద్యా, ఆరోగ్యం పర్యవేక్షణ ఎంతో అవసరం అని, అంగన్వాడి కేంద్ర పరిధిలోని ప్రీ స్కూలింగ్ బాల బాలికలకు, బాలింతల వారి సంక్షేమం సంబంధిత అంగన్వాడీ కార్యకర్తలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులదే అని అప్రమత్తంగా జాగ్రత్తగా వారిని చూసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. బుధవారం వెంకటగిరి పట్టణం పరిధిలోని అంగన్వాడి కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేసారు.