తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో కుటుంబ సమేతంగా దొంగతనాలకు పాల్పడే అంతరాష్ట్ర దొంగల ముఠాను తిరుపతి రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు దొంగలను అరెస్ట్ చేయడంతో పాటు రూ. 10. 31లక్షల విలువైన బంగారు అభరణాలు, రూ. 3. 55లక్షల నగదును రికవరీ చేశారు. మంగళవారం తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీఎస్పీ రమణకుమార్, రూరల్ సీఐ చిన్నగోవిందు వివరాలను వెల్లడించారు.