తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కొలువు దీరిన తమలపాకు వినాయకుడు శనివారం భక్తులకు కనువిందు చేస్తున్నాడు. తిరుపతి నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా దగ్గరుండి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి పర్యవేక్షణ చేస్తున్నారు.