కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్, ఏఐటీసీ మాజీ ఛైర్మన్ రామ్ అవతార్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశ్వీరచనం అందించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్థానికులకు మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేలా టీటీడీ చర్యలు తీసుకోవాలని చింతామోహన్ డిమాండ్ చేస్తున్నారు.