సత్యవేడు నియోజకవర్గం బీఎన్ కండ్రిగ ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం వైద్యాధికారి దివాకర్, ఆరోగ్య అధికారి వెంకటేశ్వర్లు క్షయ వ్యాధి నివారణపై ఎం ఎల్ హేచ్ పీ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రెండు వారాలకు మించి దగ్గు, తెమడలో రక్తం పడడం, జ్వరం, బరువు తగ్గడం వంటివి క్షయ వ్యాధి లక్షణాలని వివరించారు. అనుమానితులను వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం స్థానిక పీహెచ్సీకి పంపాలని సూచించారు.