సత్యవేడు నియోజకవర్గం కేవీబీ. పురం మండలంలోని కాలంగి నది శుక్రవారం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గురువారం గేట్లు ఎత్తివేయడంతో రిజర్వాయర్ లోని నీరు దిగువకు పరుగులు పెడుతోంది. దీంతో వాగులు, వంకల్లోకి నీరు పుష్కలంగా చేరుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. కాగా మండలంలోని పూడి వద్ద రాకపోకలు నిలిచిపోయాయి.