పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం పెద్ద ఉప్పరపల్లి నుంచి బోనమందకు వెళ్లేందుకు సోమవారం అధికారులు, నాయకులు సమన్వయంతో తాత్కాలిక వంతెనను ప్రజల సౌకర్యార్థం నిర్మించారు. ఈ వంతెన పై రాకపోకలు కూడాసాగాయి. వంతెన సిద్ధమైందని ఏడు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకొని లోపే సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీవర్షం దెబ్బకు యుద్ధ ప్రాతిపదికన చేసిన తాత్కాలిక వంతెన నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది.