చిత్తూరు జిల్లా వి. కోటలో మూడు రోజులుగా వర్షం కురుస్తున్నట్లు స్థానికులు శుక్రవారం తెలిపారు. వర్షం ధాటిరి పలు రోడ్లు మురికి నీటితో మునిగాయి. వారం రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు వర్షం రాకతో ఉపశమనం పొందారు. వేరుశెనగ, టమోటా పంటలు సాగుచేసిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు.