మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న చింత చెట్టు ఆదివారం ఉదయం జాతీయ రహదారిపై కూలిపోయింది. సైకిల్ పై వెళుతున్న చంద్రాచారి గాయపడగా తృటిలో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న వన్ టౌన్ సీఐ చాంద్ బాషా, ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం, టీడీపీ యువనేత పూలకుంట హరి సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. అటవీశాఖ అధికారి త్యాగ చెట్టును రోడ్డు పైన లేకుండా తొలగించే కార్యక్రమాలు చేపట్టారు.