చిత్తూరు సంతపేట ఆర్ ఆర్ గార్డెన్లో మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ విద్యాధరి నేడు పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. టెండర్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. దరఖాస్తుదారులు ముందుగానే ఆర్ ఆర్ గార్డెన్‌కు చేరుకోవాలని కోరారు. పారదర్శకంగా టెండర్ నిర్వహిస్తామని చెప్పారు.