చిత్తూరు జిల్లా , గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ గత నెల 27న మరణించిన హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ రాజు కుటుంబానికి సోమవారం ఐ డి ఆర్ ఎఫ్ ఫండ్ నుండి లక్ష రూపాయల చెక్కును వారి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ తరపున అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్ ఉన్నారు.