చిత్తూరు జిల్లాలో పకడ్బందీగా ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం తెలిపారు. జిల్లా సచివాలయంలో కలెక్టర్, ఎస్ పి మణికంఠ చందోలుతో కలిసి ఇసుక విధానంపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, తక్కువ ధరకు ఇసుకను ప్రజలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. https: //sand. ap. gov. in/ ఇసుక కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.