భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం తెలిపారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు వర్షాలపై సమీక్షిస్తున్నారని చెప్పారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి నివేదిక అందజేస్తున్నట్టు వెల్లడించారు. నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం ఉందన్న సమాచారం మేరకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టామన్నారు.