చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ నగరంలో జనంలో జిజెయం కార్యక్రమం మంగళవారం చేపట్టారు. వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా నగరంలోని నీవా నది పరివాహక ప్రాంతాల్లో చేపడుతున్న పూడికతీత పనులను పరిశీలించారు. నది పరివాహక లోతట్టు ప్రాంతాలైన 22వ వార్డు తేనెబండ బ్రిడ్జ్, ఓల్డ్ ప్రశాంత్ నగర్,40, 41, 45, 48వ వార్డుల సమీపాన గల లిల్లి బ్రిడ్జి మరియు 4వ వార్డులో గల కట్టమంచి ఓల్డ్ బ్రిడ్జి వద్ద పర్యటించారు.