చంద్రగిరి మండలం తొండవాడ స్వర్ణముఖి నది ఒడ్డున వెలసిన శ్రీఅగస్తేశ్వర స్వామివారి రుద్రపాదాల ముక్కోటి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఉదయం మూలమూర్తికి అభిషేక సేవలను నిర్వహించి, శాస్త్రోక్తకంగా ఉత్సవాలకు నాంది పలుకుతూ ధ్వజారోహణం నిర్వహించారు. సాయంత్రం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారు మూషిక వాహనంపై ఊరేగుతూ ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.