చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సానిటేషన్ వర్కర్స్ జీవో నెంబర్ 549 ప్రకారం జీతాలు చెల్లించాలని ఏఐటియూసి నేత దాసరి చంద్ర మంగళవారం డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్స్ తో కలిసి నిరసన చేపట్టారు. 2017లో ప్రభుత్వ ఆసుపత్రిని అపోలోకు అప్పగించినప్పటి నుంచి శానిటేషన్ వర్కర్లు చాలీచాలని జీతంతో అవస్థలు పడుతున్నారన్నారు. అధికారులు స్పందించి ప్రకారం జీవో జీతాలు చెల్లించాలన్నారు.