పొన్నూరు అర్బన్ ఎస్సైగా శ్రీహరి నియామకం

78பார்த்தது
పొన్నూరు అర్బన్ ఎస్సైగా శ్రీహరి నియామకం
గుంటూరు జిల్లా, పొన్నూరు అర్బన్ ఎస్సైగా నాగాల శ్రీహరి గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా గుంటూరు విఆర్ నుండి బదిలీపై పొన్నూరు వచ్చారు. పొన్నూరుఅర్బన్ పరిధిలో శాంతిభద్రతలకు కృషి చేస్తానని ఆయన మీడియాకు తెలిపారు. స్టేషన్లో పలువురు సిబ్బంది ఎస్సై శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు. కాగా గతంలో ఎస్ఐ శ్రీహరి తెనాలి, తుళ్లూరు, కర్లపాలెం, అమరావతి స్టేషన్లలో పనిచేశారు.

தொடர்புடைய செய்தி