నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో జీవో నెంబర్ 115 రద్దు చేయాలని కోరుతూ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నర్సులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మద్దతుగా మంగళవారం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో కొనసాగుతున్న ధర్నా కార్యక్రమంలో
ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్టాప్ నర్సులుగా పనిచేస్తున్న నర్సులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని కోరారు.