గుంటూరు సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సాహం అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. ఈ మేరకు ఆదివారం గుంటూరు పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి, పూలకుండి అందించి స్వాగతం పలికారు. నగర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కమిషనర్ వివరించారు. నగర అభివృద్ధికి తగిన విధంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.