ఉపముఖ్యమంత్రి పవన్ కేంద్రం సహకారంతో పల్లెల్లో కొత్తవెలుగులు నింపాలని కృషి చేస్తున్నారు. ఎన్నడూ లేని రీతిలో పంచాయతీలకు నిధులు, వేలకోట్ల రూపాయల ఉపాధిహామీ పనులకు ఆమోదం తెలపారు. ఆదివారం చిలకలూరిపేట మండలం పాత రాజపేట, కొత్త రాజపేటలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. ఉపాధిహామీ నిధులతో 2 గ్రామాల్లోను సీసీ రహదారులు, నిర్మించనున్న పనుల ఆవిష్కరించారు.