బల్లికురవలోని తాసిల్దార్ కార్యాలయం నందు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ఆయా సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి వెంటనే పరిష్కరించాలని రవికుమార్ ఆదేశించారు. అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.