అద్దంకి మండలం వేణుగోపాలపురం గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ కాలేషా వలి, అబ్దుల్లా అనే ఇద్దరు గ్రామంలో ఇటుక బట్టీల మట్టి కోసం తవ్విన క్వారీలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. గేదెలను కాసేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మట్టి క్వారీలలో నీరు ఉండటంతో గమనించక నీటి కుంటలో కూరుకుపోయారు. కుంటలో నీరు ఎక్కువగా ఉండటంతో ఊపిరి ఆడక ఆ ఇద్దరు దుర్మరణం చెందారు.