అద్దంకి లోని తాసిల్దార్ శ్రీ చరణ్, ఎండిఓ సింగయ్యలకు జిల్లా 108 కార్యదర్శి హరిబాబు గురువారం సమ్మె నోటీసు ను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 108 ను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని అన్నారు. ప్రస్తుతం 12 గంటల పని దినాలను రద్దుచేసి ఎనిమిది గంటల విధానాన్ని అమలు చేయాలని హరిబాబు డిమాండ్ చేశారు. చనిపోయిన ఉద్యోగస్తులకు 20 లక్షలు బీమా సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.