AP: రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల్లో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. ‘విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై సమగ్ర రవాణా ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ ప్రణాళికను కేంద్రానికి పంపాం. కేంద్రం నుంచి అనుమతులు రాగానే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తాం. మెట్రో రైలు రాకుండా గత ప్రభుత్వం కక్షపూరితంగా పక్కన పెట్టేసింది. మెట్రో ప్రాజెక్టుపై స్వయంగా కేంద్ర మంత్రిని కలిశాం.’ అని మంత్రి నారాయణ అన్నారు.