రైల్వే కోడూరు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా 27 కోట్ల 48 లక్షల రూపాయల వ్యయంతో కోడూరు నుండి చిట్వేలు రహదారి విస్తరణ పనులను రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి పరిశీలించారు. గురువారం వారు మాట్లాడుతూ పనులను వేగవంతం చేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులను ఆదేశించారు.