చిట్వేలు మండలం గట్టుమీద పల్లి దగ్గర ప్రభుత్వ భూమిని ప్లాట్లు వేసి వికలాంగులు కేటాయించాలని వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆంధ్రయ కోరారు. బుధవారం దివ్యాంగులు చిట్వేలి రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ 79లో 2007న వరద బాధితులు 62 మంది వికలాంగులకు పునరావాసం కల్పించుటకు కేటాయించిన 3.80 ఎకరాల భూమిని ప్లాట్లు వేసి దివ్యాంగులకు కేటాయించాలని ఆయన కోరారు.