బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని అసైన్మెంట్ లబ్ధిదారులకు భూములను సర్వే చేసి చూపాలని
సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం తాహాసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ. శివకుమార్ మాట్లాడుతూ 17 సంవత్సరాల క్రితం భూ పంపిణీలో భాగంగా అప్పటి ప్రభుత్వం అధికారులు అసైన్మెంట్ కమిటీ ద్వారా పంపిని చేసిన పట్టాలకు ఇంతవరకు సర్వేచేసి భూములు చుపలేదని తెలిపారు.